AP Class 9 Fa1 Telugu Question Paper 2023-24, AP Class 9 Fa1 Exam 2023-24

Parmeshwari Mam
7 Min Read
WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP Class 9 Fa1 Telugu Question Paper 2023-24, AP Class 9 Fa1 Exam 2023-24

     

Introduction

Welcome to the world of Telugu literature, where language and culture blend beautifully. As a Class 9 student in Andhra Pradesh, your journey into the fascinating realm of Telugu language begins with the Formative Assessment 1 (FA1) exam. This article will guide you through the AP Class 9 Fa1 Telugu Question Paper for the academic year 2023-24, helping you excel in your studies and achieve academic success.

1. Understanding the Importance of FA1 Telugu Exam

The Formative Assessment 1 (FA1) is a crucial milestone in your Class 9 academic year. This exam is designed to assess your understanding of the Telugu language, literature, and grammar. It helps teachers identify your strengths and weaknesses early in the academic year, enabling them to tailor their teaching methods to suit your individual needs.

2. Syllabus and Marking Scheme

Before diving into exam preparation, it’s essential to be familiar with the syllabus and marking scheme. The AP Class 9 Fa1 Telugu Question Paper will cover various aspects of the language, including grammar, comprehension, poetry, and prose. Make sure to allocate sufficient time for each section, as per the marking scheme, to score well overall.

నిర్మాణాత్మక మూల్యాంకనం-1, 2023-24

తరగతి : 9, ప్రథమ భాష తెలుగు

I. అవగాహన ప్రతిస్పందన: (4మార్కులు)

అ). కింది పద్యమును పాదభంగం లేకుండా పూరింపుము.

1. పాదభంగం లేకుండా పూరిస్తే పాదమునకు ఒక మార్కు చొప్పున –

ఆ దుర్యోధనుఁడంత మాత్రయును జేయంజాలఁడో కాని, పెం

పేదం గ్రూరత కోర్వరాదు, సిరి నాకేలందునే, గ్రాసవా

సోదైన్యంబులు వచ్చు నాయరయునీ చుట్టాలకుం, గావునన్

మోదంబందుట గల్గుఁ గౌరవులు నేముం బొంది శ్రీనొందినన్

II. వ్యక్తీకరణ – సృజనాత్మకత: (12 మార్కులు)

శాంతి కాంక్ష పాఠ్యభాగ రచయితను గూర్చి సొంత మాటల్లో రాయండి.

2. కింది ప్రశ్నలకు నాలుగు లేక ఐదు వాక్యాల్లో సమాధానాలు రాయండి.

మహాభారతాన్ని తెలుగులో కవిత్రయం వారు రచించారు. వారిలో తిక్కన రెండోవాడు. వారు 13వ శతాబ్దానికి చెందిన మహాకవి. నెల్లూరును పరిపాలించిన మనుమసిద్ధికి మంత్రిగా, ఆస్థానకవిగా ఉన్నాడు. తిక్కన మొట్టమొదట ‘నిర్వచనోత్తర రామాయణము’ ను రచించి మనుమసిద్ధికి అంకితం ఇచ్చాడు. తిక్కన రెండవ గ్రంథం ‘మహాభారతం’ విరాటపర్వం నుండి స్వర్ణారోహణ పర్వం వరకు 15 పర్వాలు రచించి హరిహరనాథునికి అంకితం ఇచ్చాడు.
మహాభారత రచనలో ఈయన తీర్చిదిద్దిన పాత్రలు సజీవంగా కనిపిస్తాయి. వీరి శైలిలో ‘నాటకీయత’ ఉంటుంది. సందర్భానుగుణంగా వీరు ప్రయోగించిన పదాలు సృష్టించిన సన్నివేశాలు రసాస్వాదన కలిగిస్తాయి. ఔచిత్యవంతంగా రసపోషణ చేయగలగడాన్ని ‘రసాభ్యుచితబంధం’ అంటారు. ఇందులో తిక్కన సిద్ధహస్తుడు. సంస్కృతాంధ్రాలలో కవిత్వం రాయగలిగిన ప్రతిభాశాలి కాబట్టి ‘ఉభయకవి మిత్రుడు’ అని కేతనాది కవులకు ప్రేరణ కలిగించి మార్గదర్శకులుగా నిలిచినందున ‘కవిబ్రహ్మ’ అనీ బిరుదులు పొందారు.

Class 9 Telugu FA1 Question Paper AP Board 2023-24 PDF

3. స్వభాష పాఠ్యభాగ నేపథ్యమును రాయండి.

ఒక పాఠశాల విద్యార్థులు తెలుగువాడైన ఒక పెద్దమనిషి వద్దకు వెళ్ళి, వార్షికోత్సవ కార్యక్రమానికి అధ్యక్షత వహించవలసిందిగా కోరారు. ఆయన న్యాయవాదవృత్తి చేస్తూ పేరు గడించినవాడు. “నేను వస్తానుగాని తెలుగులో మాట్లాడలేను. ఇంగ్లీషులో మాట్లాడతానన్నాడు. పిల్లలు సరే అనక తప్పలేదు. సమావేశానికి వచ్చిన ఆ పెద్దమనిషి ఆంగ్లంతో ‘దేహసాధన’ గురించి పావుగంట మాట్లాడి ‘విల్ ఎనీ జెంటిల్మన్ కమ్ ఫార్వర్డు టు స్పీక్’ అని ముగించాడు. అప్పుడా సభలోనున్న జంఘాలశాస్త్రి లేచి ఈ విధంగా ఉపన్యసించాడు

ఇ). కింది వానిలో ఒక ప్రశ్నకు ఎనిమిది నుండి పది వాక్యాలలో సమాధానాలు రాయండి. 1×8=8 మా॥

4. జంఘాలశాస్త్రి మంచి వక్త అని ఎలా చెప్పగలవు.

మంచివక్తకు ప్రధానంగా సభలో పిరికితనం పనికిరాదు. కొత్త ప్రదేశమైనా, కొత్త మనుషులైనా చొరవగా చొచ్చుకుపోగలగాలి. వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోగల నేర్పు ఉండాలి. జంఘాలశాస్త్రికి అటువంటి చొరవ, నేర్పు ఉన్నాయి. చెప్పదలచుకొన్న అంశం పై సాధికారత ఉండాలి. సందర్భానుగుణంగా మాట్లాడే ఇతర అంశాలపై కూడా పట్టు ఉండాలి. భావానుగుణంగా భాష తడబాటు లేకుండా నదీ ప్రవాహంలా  ఉరకలెత్తాలి. చెప్పదలచుకొన్న విషయాన్ని పక్షపాతం చూపకుండా నిర్భయంగా, స్పష్టంగా చెప్పగలగాలి. ఈ గుణాలన్నీ జంఘాలశాస్త్రిలో పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి జంఘాలశాస్త్రి మంచి వక్త అని చెప్పవచ్చు.

(లేదా)

జంఘాలశాస్త్రి ఆవేదన గూర్చి రాయండి.

1. హరహరా! ఎంత చెడ్డమాట విన్నాను. ఈ మాటలు విని నా గుండెలు పగిలాయి. మనస్సు మండిపోయింది?

2. మన అధ్యక్షుడు తెలుగు వారైన తల్లిదండ్రులకు పుట్టాడు. కనీసం ఆఱు సంవత్సరాల వయస్సు వచ్చే వరకైనా తెలుగులో మాట్లాడాడు. ఇప్పుడు ఇంగ్లీషు నేర్చుకున్నంత మాత్రాన తెలుగులో మాట్లాడలేకపోడు. మాట్లాడలేనని చెప్పడం అసత్యం.

3. పరభాషాపదాల అర్థం తెలియగానే పరభాషా పాండిత్యం మనకు రాదు. ఆ భాషలోని ఆత్మను  గ్రహించాలి. అది మనకు అసాధ్యం. స్వభాష మన చేతిలో చచ్చింది. నేర్చుకున్న పరభాషలో ఆత్మ తెలియలేదు. మన గతి ఉభయ భ్రష్టమయ్యింది.

4. పరభాషను నేర్చుకోవడానికి పడిన శ్రమలో 16వ వంతైనా అక్కరలేకుండా దేశభాషలో పండితులు కావచ్చు. మనము స్వభాషను తల్లి కడుపులో ఉన్నప్పుడు నేర్చుకోవడం మొదలుపెట్టాము

5. తెలుగుభాష రాదని తెలుగువాడు అనడం అనుచితం. మా తెలుగుభాష మాకు రాదని ఏ తెలుగువాడు  నోటితో అనకూడదు.

6. ఇలా పరభాషా వ్యామోహంతో స్వభాషకు దూరమై “రెంటికీ చెడ్డ రేవడి”లా తయారవుతున్నాం. ఈ విధంగా జంఘాలశాస్త్రి ఆవేదనతో పలికాడు.


Download AP Class 9 FA1 Telugu Exam Question Paper PDF

గమనిక: ఇటువంటి అంశాలు ఏవి రాసినా మార్కులు ఇవ్వవలెను.

III. భాషాంశాలు: (4మార్కులు) 


ఈ క్రింది వానికి సరైన జవాబును గుర్తించి బ్రాకెట్లలో రాయండి

5. ‘ప్రణవి’ మాటలు చిలుకపలుకుల్లా ఉంటాయి.
(గీతగీసిన పదానికి అర్ధం)
ఎ) చిలుకముక్కు     బి) ముద్దముద్దు మాటలు
సి) వేరుశనగ పలుకులు  డి) నిరర్థకంగా

బి). ముద్దముద్దు మాటలు

6. తెలుగు భాష గొప్పదనం ప్రతి విద్యార్థి తెలుసుకోవాలి.
(గీతగీసిన పదానికి వికృతి గుర్తించండి.)
ఎ) బాసు         బి) యాస
సి) ఆక            డి) బాస

డి). బాస

7. “తెల్లగుర్రం” ఈ పదం ఏ సమాసమో రాయండి..
ఎ) నన్ తత్పురుషు        బి) ద్విగు సమాసం:
సి) విశేషణ పూర్వపద కర్మధారయం    డి) షష్ఠితత్పురుష

సి). విశేషణ పూర్వపద కర్మధారయం

8. “ఆంధ్రుడు, కృష్ణాతీరమున పుట్టినవాడు” ఇది ఏ వాక్యం
ఎ) సంక్లిష్ట వాక్యం      బి) సంయుక్త వాక్యం
సి) చేదర్థక వాక్యం      డి) శత్రర్ధక వాక్యం

బి). సంయుక్త వాక్యం

3. Tips for Effective Exam Preparation

1: Create a Study Schedule

Prepare a study schedule that balances your daily academic commitments. Allocate specific time slots for Telugu exam preparation, ensuring regular practice without overwhelming yourself.

Review Previous Lessons

Revise the Telugu lessons covered in Class 8 to build a strong foundation for Class 9 concepts. Understanding the fundamentals will boost your confidence and comprehension during the FA1 exam.

Practice Sample Papers

Solving sample papers and previous years’ question papers is an excellent way to familiarize yourself with the exam pattern and question types. It helps identify frequently asked questions and enhances time management skills.

Focus on Grammar and Vocabulary


Pay special attention to grammar rules, sentence structures, and new vocabulary words. A robust understanding of grammar will enhance your writing skills, while a rich vocabulary will enrich your comprehension abilities.

Engage in Reading


Read Telugu literature regularly to improve your language fluency and understanding of diverse writing styles. Classic and contemporary Telugu texts offer unique perspectives and expose you to various genres.

Conclusion

The AP Class 9 Fa1 Telugu Question Paper for the academic year 2023-24 holds the key to unlocking your potential in the captivating world of Telugu literature. By following the tips and strategies outlined in this article, you can approach the exam with confidence and achieve excellent results.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *