AP Class 8 CBA1 Fa1 Telugu Question Paper 2023-24, AP Class 8 CBA1 Fa1 Telugu Answer key 2023

Parmeshwari Mam
9 Min Read
WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP Class 8 CBA1 Fa1 Telugu Question Paper 2023-24, AP Class 8 CBA1 Fa1 Telugu Answer key 2023
     





Welcome to the world of education, where examinations play a pivotal role in assessing a student’s understanding and knowledge. In Andhra Pradesh, the Class 8 CBA1 Fa1 Telugu examination holds particular significance as it lays the foundation for a student’s academic journey. In this article, we will delve into the details of the AP Class 8 CBA1 Fa1 Telugu Question Paper for the academic year 2023-24. From its structure to preparation tips, we will cover everything you need to know to excel in this crucial examination.

What is CBA1 Fa1?

CBA1 Fa1 stands for “Class-Based Assessment 1 Formative Assessment 1,” and it is a vital component of the academic evaluation process in Andhra Pradesh. It is designed to gauge students’ understanding of the Telugu language and their proficiency in reading, writing, and comprehension.

Preparation Strategies

Effective Study Plan


A well-structured study plan is essential for comprehensive exam preparation. Breaking down the syllabus, setting achievable goals, and following a disciplined approach can significantly enhance a student’s performance.

Recommended Resources


Apart from textbooks, students can explore additional resources such as reference books, online tutorials, and educational websites to gain a deeper understanding of the language.

Classroom Based Assessment – 1 (2023-24)

UDISE Code:
Child ID:
Child Name:
Class-Subject:8-Telugu
No. of Questions: 18
Duration: 60 minutes

సెక్షన్ A : : బహుళైశ్చిక ప్రశ్నలు -ప్రతి ప్రశ్నకి నాలుగు ఎంపికలు ఉంటాయి మరియు ఆ ఎంపికలలో ఒక ఎంపిక మాత్రమే సరైన సమాధానమవుతుంది. 15 × 1M = 15M

1 గీత గీసిన పదానికి సరైన పర్యాయ పదములను గుర్తించండి.

ఇంటికి దీపం ఇల్లాలు

A కుమార్తె, సుపుత్రి

B అర్ధాంగి, గృహిణి

C పూర్ణాంగి, ఇంతి

D కోడలు, వధువు

2 గీత గీసిన పదానికి సరైన ప్రకృతి పదమును గుర్తించండి.

మా ఊరి జాతర చాలా సందడిగా జరిగింది.

A యాతన

B యాత్ర

C పాతర

D యాచన

3 గీతగీసిన పదానికి సరైన వికృతి పదమును గుర్తించండి.

పిల్లలు నిద్ర పోతున్నారు, శబ్దము చేయకుండా లోపలి రండి.

A గొడవ

B రొద

C సద్దు

D సందడి

4 గీతగీసిన పదానికి సరైన సంధి విచ్చేదనమును గుర్తించండి.

మనిషన్నవాడు రోజుకు ఖచ్చితముగా ఎనిమిది గంటలు నిద్రపోవలెను.

A మనిషి + యన్నవాడు

B మనిషి + అన్నవాడు

C మనిషి+ అన్నవాడు

D మ + నిషన్నవాడు

5 గీతగీసిన పదానికి సరైన సంధి నామమును తెలుపుము.

కరోనా వ్యాధి భయముతో ప్రపంచమంతా వణికిపోయింది.

A అత్వ సంధి


B ఇత్వ సంధి

C ఉత్వ సంధి

D రుకారసంధి

6 క్రింది వాక్యములో దాగియున్న ద్విగు సమాస పదమును గుర్తించండి.

ఇంటిలోని పెద్దలుపిన్నలు స్నానపానాదులు ఆచరించి త్రిచక్ర వాహనంలో గుడికి వెళ్లారు.

A పెద్దలుపిన్నలు
B స్నానపానాదులు
C ఆచరించి
D త్రిచక్ర వాహనం

7. క్రింది వాక్యంలో గీతగీసిన పదములు ఏ సమాసమునకు సంబంధించినవి?

అన్నదమ్ములు అందరూ రామలక్ష్మణులు వలె కలిసిమెలిసి ఉండాలి.

A కర్మధారయ సమాసము

B ద్విగు సమాసము

C ద్వంద్వ సమాసము

D బహువ్రీహి సమాసము

8. గీత గీసిన పదానికి సరైన విగ్రహ వాక్యమును గుర్తించండి.

నేడు ఉన్నతవిద్య కోసం విదేశములు వెళ్ళుట సర్వ సాధారణ విషయము.

A ఉన్నతి కోసము విద్య

B ఉన్నతమైన విద్య

C ఉన్నతి యొక్క విద్య

D ఉన్నతికి విద్య

9. సరైన ద్వితీయా విభక్తి ప్రత్యయము వాక్యమును గుర్తించండి .

A రవి చాలా టక్కరివాడు.

B అమ్మ పండగ కొరకు మిఠాయిలు తయారు చేసింది.

C నా వలన బడికి ఆలస్యము అయినది.

D నాన్న అమ్మను పిలిచారు.

10. క్రింద ఇచ్చిన గీత గీసిన ప్రత్యయములు ఏ విభక్తి కి సంబంధించినవి?

క్రిందటి ఏడు కంటే ఈ సంవత్సరము పంటలు బాగా పండాయి. దాని వలన రైతు

లాభపడ్డాడు. నాగలి చేత పట్టి దుక్కి దున్ని అన్నం పెట్టే రైతన్న ఎప్పుడూ గొప్పవాడే కదా!

A ప్రధమా విభక్తి

B ద్వితీయా విభక్తి

C చతుర్థీ విభక్తి

D పంచమీ విభక్తి

మంగళ గ్రహము(అంగారకగ్రహము ) పైన జీవనము సాధ్యమా! అను విషయము పై శాస్త్రజ్ఞులు పలు ప్రయోగములు చేసి చివరకు “క్యూరియాసిటీ” అను రోవారును మంగళ గ్రహము పైకి పంపిరి. రోవర్ అనునది ఎటువంటి రోదసీ వాహనము అంటే అన్ని గ్రహములలో వాతావరణమును తట్టుకొని నిలబడగలదు. ఇది ఏ గ్రహము యొక్క ఉపరితలం పైనైనా నిలబడగలదు . ఈ శక్తివంతమైన రోవారును అమెరికా దేశమునకు చెందిన అంతరిక్ష పరిశోధన శాల అయిన “నాసా” అభివృద్ధి చేసెను. 2012లలో దీనిని మంగళగ్రహము పైకి పంపిరి. “క్యూరియాసిటీ” మంగళ గ్రహము కక్ష్యలోకి సురక్షితముగా చేరి అక్కడ గ్రహము ఉపరితలం పైన ఉన్న మట్టి మరియు చిన్న చిన్న కొండలు, గుట్ట యొక్క నమూనాలను పరీక్షించెను. దీని ఆధారముగా శాస్త్రజ్ఞు లకు ఈ గ్రహము యొక్క అభివృద్ధి ఎలా జరిగినది? జీవజాలం మనుగడ సాగించుటకు ఇక్కడ కూడా అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయా? అను ప్రశ్నలకు సమాధానములు వెదుకుచున్నారు. శాస్త్రజ్ఞులకు మంగళగ్రహములోని రహస్యమయ విషయములు ఎప్పుడూ ఆసక్తిదాయకమే . ఆ రహస్యాలను ఛేదించుటకు ఎన్నో రోదసీ నౌకలను పంపించిరి.

పదండి మంగళ గ్రహము గురించిన కొన్ని ఆసక్తిదాయకమైన విషయములను తెలుసుకుందాము.

సౌరమండలములో రెండు రకముల గ్రహములు ఉండును. వానిలో కొన్ని వాయు భరిత గ్రహములు, అనగా అవి పూర్తిగా వాయువుతో నింపబడి ఉండును. ఇప్పుడు ఇంక రెండో రకము గ్రహాలు భూమి మాదిరిగా ఎత్తు పల్లముల నేల మట్టి, గుట్టల తో నిండి ఉంటాయి. మంగళ గ్రహము కూడా అలాంటి కోవకు చెందినది. ఇది సౌరమండలములో ఏడవ పెద్ద గ్రహము, మరియు భూమి నుండి సుమారు 560 లక్షల కిలోమీటర్ల దూరములో ఉన్నది. ఈ గ్రహములో అధిక మొత్తములో e * S ^ 6 ఉండుట వలన ఎర్రని రంగులో కనపడును, అందుచే దీనిని ‘ఎరుపు గ్రహము’ అని కూడా

ఇసుక, గుట్టలతో నిండిన ఈ గ్రహము యొక్క పావు భాగము చిమ్మ చీకటిగా ఉండును. ఆ చీకటి భాగము ఆకుపచ్చ మరియు నీలి రంగులో కనపడును.

భూమి తరహాలో దీనిలో కూడా అగ్ని పర్వతములు కలవు, ప్రఖ్యాత ‘ఒలంపస్ మాస్ ‘ మంగళ గ్రహములోనే కలదు.

మంగళ గ్రహానికి ‘ఫోబోస్’, ‘డిమోజ్ ‘ అను రెండు చంద్రుళ్లు కలరు. వీటి పేర్లను ప్రఖ్యాత గ్రీకు పౌరాణిక గాధలలోని పాత్రల ఆధారముగా పెట్టిరి.

ఈ గ్రహము యొక్క చుట్టుకొలత భూమి యొక్క చుట్టుకొలతలో సగము ఉండును.

పైన ఇచ్చిన వ్యాసము ఆధారముగా ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు వ్రాయండి.

11 మంగళ గ్రహము పైకి పంపించిన ‘క్యూరియాసిటీ ‘ అను రోదసి వాహన విశేషత ఏమిటి ?

A తక్కువ ఇంధనంతో ఎక్కువ గంటలు నిరంతరముగా పని చేయగలదు
B తక్కువ బరువు ఉండటం వలన తేలికగా అన్ని గ్రహములలో ప్రయాణము చేయగలదు.
C నాసా అంతరిక్ష పరిశోధనా కేంద్రములో ఆ రోదసీ నౌక తయారు చేయబడటం.
D అన్నిరకాల వాతావరణములను తట్టుకొని అన్ని గ్రహముల ఉపరితలాలపై నిలబడగలదు

12 శాస్త్రజ్ఞులు మంగళ గ్రహము నివాస యోగ్యమైనదని నమ్ముటకు గల కారణము ఏమిటి?

A మంగళగ్రహము సౌరమండలములో ఏడవ పెద్ద గ్రహము

B ఇది ఎరుపు రంగులో లోహాలతో నిండి ఉండుట వలన

C మంగళగ్రహము భూమి నుండి సుమారు 560 లక్షల కిలోమీటర్ల దూరములో భూమికి దగ్గరగా ఉన్నది.

D మంగళ గ్రహ ఉపరితలము భూమి మాదిరిగా ఉండి, అక్కడ నీటి ఉనికిని గమనించుట.

13 మంగళ గ్రహానికి ‘ఫోబోస్’, ‘డిమోజ్’, అను రెండు చంద్రుళ్లు కలరు. ఈ వాక్యంలో ‘రెండు చంద్రుళ్లు’ పదానికి సరైన విగ్రహవాక్యమును వ్రాయండి.

A రెండైన చంద్రుళ్లు

B రెండుగా గల చంద్రుళ్లు

C రెండుగా ఉన్న చంద్రుళ్లు

D రెండు సంఖ్య గల చంద్రుళ్లు

14 మంగళగ్రము భూమి కన్నా చిన్నది అని ఎలా చెప్పగలవు?

A ఈ గ్రహము యొక్క పావు భాగము చిమ్మ చీకటిగా ఉండుట వలన చిన్నది.

B ఒలంపస్ మాస్ ‘ వంటి అగ్ని పర్వతములతో ఆక్రమించబడి చిన్నగా ఉండును.

C లోహాలతో నింపబడి పరిమాణములో చిన్నగా ఉండును.

D భూమి చుట్టుకొలతలో ఈ గ్రహము యొక్క చుట్టుకొలత సగము ఉండును.

15 మంగళ గ్రహము పైన శాస్త్రజ్ఞుల ఏ విషయం పై తీవ్రముగా పరిశోధనలు చేసారు?

A జీవజాలం మనుగడకు అనుకూల పరిస్థితుల సాధ్యత గురించి

B అక్కడ లోహ గనుల ఉనికిని గురించి

C మంగళ గ్రహము నుండి వేరే గ్రహానికి దారి కనుగొనుటకు

D అక్కడ భవన నిర్మాణ సాధ్యత గురించి సెక్షన్

B: మీ జవాబు పత్రాలలో ఈ క్రింది ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వండి. 2 × 1M = 2M

16 “ అనర్గళంగా ” అను పదానికి అర్ధము తెలిపి ఒక సొంత వాక్యమును వ్రాయండి.

17 ‘చిత్తశుద్ధి’ అను పదానికి అర్ధము తెలిపి దానిని మీ సొంత వాక్యంలో వ్రాయండి.

సెక్షన్ C: మీ జవాబు పత్రాలలో ఈ క్రింది ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వండి. 1 ×  3M = 3M

18 వీరజవానుల సేవలను కీర్తించే ఒక చక్కటి నినాదాన్ని వ్రాయండి.

Conclusion

The AP Class 8 CBA1 Fa1 Telugu examination is not just a test of academic knowledge; it celebrates the cultural heritage and language of Andhra Pradesh. By understanding the syllabus, mastering effective study strategies, and employing smart examination techniques, students can excel in this assessment. Remember, this is not just a one-time examination, but a stepping stone to a journey of continuous learning and growth.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *