AP Class 10 Telugu Fa1 Question Paper 2023-24, Telugu FA1 Question Paper for AP Class 10 2023-24 PDF

Parmeshwari Mam
7 Min Read
WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP Class 10 Telugu Fa1 Question Paper 2023-24, Telugu FA1 Question Paper for AP Class 10 2023-24 PDF

            


Introduction


As the academic year 2023-24 commences, the Andhra Pradesh Board of Secondary Education has released the first formative assessment (FA1) question paper for Class 10 Telugu. This article aims to provide a comprehensive overview of the question paper and its significance, along with tips to excel in the examination. Let’s dive into the details and understand how students can prepare effectively for the evaluation.


1. Understanding Formative Assessment (FA1)


Formative Assessment (FA) is an essential part of the education system, where students are evaluated on a continuous basis throughout the academic year. FA1 is the first such assessment conducted during the academic year 2023-24 for Class 10 Telugu students in Andhra Pradesh.


2. Overview of AP Class 10 Telugu FA1 Question Paper


The AP Class 10 Telugu FA1 question paper is designed to assess students’ understanding of the Telugu language, literature, and grammar. It is structured to evaluate their reading, writing, and analytical skills. The question paper is divided into several sections, each targeting specific aspects of the subject.




నిర్మాణాత్మక మూల్యాంకనం-1, 2023-24

తరగతి : 10, ప్రథమ భాష తెలుగు



I. అవగాహన ప్రతిస్పందన: (4మార్కులు)


అ) క్రింది పద్యమును పాదభంగం లేకుండా పూరింపుము.


1. శివరాజంతట మేలు మంగుఁ డెరలో ……………. మాతా! తప్పు సైరింపుమీ!”


శివరాజంతట మేల్ముసుంగుఁ దెరలో – స్నిగ్ధాంబుదచ్ఛాయలో


నవసౌదామినిఁ బోలు నా యవనకాంతారత్నమున్ భక్తి గౌ


రవముల్ వాఱఁగఁ జూచి పల్కె “వనితారత్నంబు లీ భవ్యహైం


దవభూజంగమ పుణ్యదేవతలు; మాతా! తప్పు సైరింపుమీ!”




AP Class 10 Telugu FA1 Question Paper 2023-24 PDF Download



II. వ్యక్తీకరణ సృజనాత్మకత: (12 మార్కులు)


ఆ) క్రింది ప్రశ్నలకు నాలుగు లేక ఐదు వాక్యాల్లో జవాబులు రాయండి 



2. ‘మాతృభావన’ పాఠ్యభాగ కవి గురించి మీకు తెలిసిన విషయాలు రాయండి.


ఆధునికాంధ్ర కవుల్లో ప్రముఖులు, శతావధాని డా॥ గడియారం వేంకటశేషశాస్త్రి. ఈయన తల్లిదండ్రులు ఈయన దుర్భాక రాజశేఖర శతావధానిగారితో కలసి కొన్ని కావ్యనాటకాలు రాశాడు. గడియారం వారి పేరు చెప్పగానే “శ్రీ శివభారతము” కావ్యం గుర్తుకు వస్తుంది. పారతంత్ర్యాన్ని నిరసించి సరసమాంబ, రామయ్యలు, కడపజిల్లా, జమ్మలమడుగు తాలూకా నెమళ్ళదిన్నె గ్రామంలో జన్మించాడు. స్వాతంత్య్ర కాంక్షను అణువణువునా రగుల్కొల్పిన మహాకావ్యం ఇది. మురారి’ ‘పుష్పబాణ విలాసము’ రఘునాథీయము; ‘మల్లికామారుతము’ మొదలైన కావ్యాలు, ‘వాస్తుజంత్రి’ (అముద్రిత వచన రచన) ‘శ్రీనాథ కవితా సామ్రాజ్యము’ (విమర్శ) ఈయన లేఖిని నుండి వెలువడ్డాయి. ‘కవితా వతంస’ ‘కవిసంహ’ ‘అవధాన పంచానన’ అనే బిరుదులను అందుకున్నాడు..


3. ‘లేఖ’ ప్రక్రియను వివరించండి.


వ్యక్తులమధ్య సంస్థలమధ్య పరస్పర సందర్భాన్నీ, సంబంధాన్నీ బట్టి రాసుకునేవి లేఖలు. లేఖ పరస్పర సమాచార భావ వినిమయానికి ఒక వారధిలాగా తోడ్పడుతుంది. కొందరు ప్రముఖవ్యక్తుల ఉత్తరాలను సాహిత్యంగా పరిగణించడం జరుగుతుంది. ఇవి ఆ వ్యక్తుల అభిప్రాయాలనూ, వివిధ వ్యక్తులతో వాళ్ళకున్న పరిచయాలను, సంబంధాలను, సమకాలీన సమాజ జీవనాన్ని పరిణామాలను తెలియజేస్తుంది. లేఖలను విమర్శకులు వ్యక్తిగత లేఖలు, వ్యాపార లేఖలు, బహిరంగ లేఖలని మూడు రకాలుగా విభజించారు. ‘జానపదుని జాబు’ అనే పాఠం లేఖా ప్రక్రియకు చెందింది. 


ఇ). కింది వానిలో ఒక ప్రశ్నకు ఎనిమిది నుండి పది వాక్యాలలో సమాధానాలు రాయండి.1X8=8 మా||


4. “పల్లెటూళ్ళు ప్రశాంత జీవిత సౌఖ్యానికి పుట్టిళ్ళు” దీన్ని సమర్థిస్తూ సమాధానం రాయండి.


1. “పల్లెటూరి జీవితం ప్రశాంతంగా ఉంటుంది” అనే అంశంతో నేను ఏకీభవిస్తాను.


2. పచ్చని చెట్లు, పంటపొలాలతో, పైరగాలులతో, పిల్ల కాలువలతో చెరువులతో పల్లెటూళ్ళు ప్రకృతి అందాలకు నిలయాలుగా ఉంటాయి.


3. పక్షుల కిలకిలరావాలతో, కోడికూతలతో పల్లె తెల్లవారుతుంది. ఆవులు, గేదెలు మొదలైన పాడిపశు వులు, లేగదూడలు చేసే సందడి ముగ్ధమనోహరంగా ఉంటుంది.


4. కల్లాకపటం ఎరుగని మనసుతో ఆప్యాయంగా పిలుచుకునే పలకరింపులు, బంధుత్వం లేకపోయినా


కలుపుకునే వరుసలు, మనసుకు హాయినీ సంతోషాన్ని కలిగిస్తాయి.


5. పస్తులు ఉండడం, కష్టాలకు ఓర్చుకోవడం, ఇవి రెండూ తప్పితే మిగతా అన్ని విషయాలలో పల్లె జీవితం హాయిగా ఉంటుంది.


6. ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకొనే ధోరణితో సాగే, పల్లె ప్రజల జీవితం, నూటికి నూరుపాళ్ళూ ప్రశాంతంగా ఉంటుంది.


7. ప్రతి ఒక్కరికి పొయ్యి క్రిందకి, పొయ్యి మీదకి అన్నీ లభిస్తాయి. అన్ని చేతివృత్తుల వారు కలసిమెలిసి సోదరభావంతో ఉంటారు.


8. కృత్రిమ ఆడంబరాలు లేని ప్రశాంత జీవనానికి పల్లెటూళ్ళు నూరుపాళ్ళు అని నా అభిప్రాయం.


AP 10th Class Telugu FA1 Model Paper Download 


మంథరుని మాటలు మీరు సమర్థిస్తారా? ఎందుకు?


ధన్యుడు పాఠాన్ని రచించిన పరవస్తు చిన్నయసూరి మంథరుడు అనే తాబేలు చేత చెప్పించిన మాటలు ఎంతో సమర్ధనీయంగా ఉన్నాయి. నాడు, నేడు, ఏనాడైనా ఆచరింపదగిన విషయాలే. మంథరుడు ధనము, యౌవనము, నిత్యములు కావనీ, జీవితం బుడగ వంటిదని, సత్యము చెప్పాడు, ధనము ఏదో రకంగా పోవచ్చు. వయస్సు తరిగిపోయి, మరణం వస్తుంది. ప్రాణం నీటిమీద బుడగలాగా ఎప్పుడైనా పోవచ్చు ఇవన్నీ అక్షర సత్యాలు.

అందువల్ల బుద్ధిమంతుడు ధనము, యౌవనము, నిత్యములు, ప్రాణము ఉన్నప్పుడే, ధర్మములు చేయాలి. లేకపోతే తరువాత బాధపడవలసి వస్తుంది. కాబట్టి మంథరుని మాటలను నేను గట్టిగా సమర్థిస్తాను.


AP SSC FA1 Telugu Question Paper PDF 2023-24


III. భాషాంశాలు: (4మార్కులు)


ఈ) క్రింది ప్రశ్నలకు సూచించిన విధంగా జవాబులు గుర్తించండి.



5. వాళ్ల గృహము చాలా బాగుంది. (గీతగీసిన పదానికి వికృతి పదం రాయండి.)


గృహము – గీము


6. ఎలుకలు వివరంలో జీవిస్తాయి. (గీతగీసిన పదానికి పర్యాయపదాలు రాయండి.


వివరం = రంధ్రం – బిలం – కలుగు మొ॥


7. గురుశిష్యులు పూదోటకు వెళ్లారు. (గీతగీసిన పదాన్ని విడదీసి రాయండి)


పూదోట = పూవు + తోట


8. శ్రీరాముని కీర్తి నలుదెసలు వ్యాపించింది.


(గీతగీసిన పదం ఏ సమాసమో రాయండి.)


నలుదెసలు = ద్వి సమాసం




3. Tips to Excel in AP Class 10 Telugu FA1 Examination


Preparing for the FA1 examination requires a systematic approach and dedication. Here are some tips to help students excel:


3.1 Regular Practice


Consistent practice is key to mastering the Telugu language. Students should regularly read Telugu literature, practice writing essays, and solve grammar exercises.


3.2 Understanding Literary Devices


To analyze and interpret poems effectively, students must familiarize themselves with various literary devices used in Telugu poetry.


3.3 Time Management


During the examination, time management is crucial. Students should allocate specific time to each section to ensure they can attempt all questions.


3.4 Seek Help from Teachers


If students encounter difficulties while preparing for the FA1 examination, they should not hesitate to seek guidance from their teachers.




5. Conclusion


The AP Class 10 Telugu FA1 question paper for the academic year 2023-24 is an essential evaluation tool that assesses students’ language skills, comprehension, and analytical abilities. By following the tips mentioned above and dedicat

ing themselves to regular practice, students can excel in this examination and lay a strong foundation for their academic journey.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *